ముందుచూపు లేని ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినేష్, సాయి, సంజన, సుమలత, నిందు ప్రధాన తారాగణంగా చలనచిత్ర కంబైన్స్ పతాకంపై టి.రాము దర్శకత్వంలో వేణుగోపాల్ చౌదరి రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ భువనగిరిలో పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు టి.రాము మాట్లాడుతూ, నేటి యువత ప్రేమ పేరుతో కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని, వారి జీవనం హాయిగా సాగినా ఆ తరువాత వచ్చే తరం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ముందుచూపు లేని ప్రేమ ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో చెప్పడమే ఈ సినిమా ప్రధానాంశమని అన్నారు. ప్రస్తుతం భువనగిరిలో తొలి షెడ్యూల్ పూర్తిచేశామని, ఇంకొక మూడు షెడ్యూల్స్ జరపనున్నామని, ప్రేమతో చేసుకున్న పెళ్లిళ్లు ఎదురుతిరిగితే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఈ చిత్రంలో చెబుతున్నామని కథానాయకుడు దినేష్ అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఆరు పాటలను ఇప్పటికే రికార్డు చేశామని ఆయన అన్నారు. అరుణ్‌కుమార్, శివ, నరేష్, విజయ్ సంపత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా :పార్శపు నారాయణ, పాటలు: రాము, సంగీతం: అర్జున్, నిర్మాత: వేణుగోపాల్ చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.టి.