కమల్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకనాయకుడు కమల్‌హాసన్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘్భరతీయుడు-2’ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా ఎంపికైందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజమేనని ధృవీకరించింది కాజల్. అంతేకాకుండా శంకర్ దర్శకత్వంలో నటించడం నా కల అని ఈ చిత్రంతో అది తీరుతుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఆమె ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననుందని సమాచారం. ఇక సూపర్‌హిట్ మూవీ ‘్భరతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ డిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్ళే అవకాశాలున్నాయి.