23న 24 ముద్దులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న 24 కిస్సెస్ చిత్రం నవంబర్ 23న విడుదల కానుంది. తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ అందుకుంది. బోల్డ్ కంటెంట్‌కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు అయోధ్య కుమార్. హెబ్బా, ఆదిత్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్నివర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. రావురమేష్, నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జోయ్‌బరువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలింస్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫర్‌గా పనిచేసారు. సిల్లీమాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రెస్పెక్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా 24 కిస్సెస్ సినిమాను నిర్మిస్తున్నారు.