కల్కి... కాపాడగలడా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హార్ట్‌ఎటాక్’ సినిమాలో నటించింది ఆదాశర్మ. మొదటి సినిమాతో చక్కని నటి అన్న పేరు తెచ్చుకుంది. అందానికి అందం.. అభినయం.. డ్యాన్సింగ్ టాలెంట్ వున్నా ఎందుకనో ఈ అమ్మడికి ఆశించినన్ని అవకాశాలు అయితే రాలేదు. ద్వితీయ ప్రయత్నంలో వచ్చినవన్నీ రెండో లీడ్ పాత్రలే. అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అంతగా ప్రాధాన్యత లేని అతిథి రోల్‌లోనే కనిపించింది. ఆ సినిమా హిట్టయినా ఆదాకు మాత్రం ఛాన్సుల్లేవ్. అడివి శేష్ ‘క్షణం’ ఛాన్స్ మలుపు అనుకుంటే.. ఆ సినిమా హిట్టయినా తనకు మాత్రం కలిసి రాలేదు. గరం, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలు ఫ్లాప్ అవ్వడం ఆదాకి పెద్ద మైనస్ అయ్యింది. ఈ గ్యాప్‌లో ఆదాశర్మ చెయ్యని ప్రయత్నమే లేదు. ఓవైపు బాలీవుడ్, మరోవైపు టాలీవుడ్, కోలీవుడ్ .. ఇలా అన్ని పరిశ్రమల్లో తనవంతు ప్రయత్నాలు చేసింది. కానీ ఆశించినంత పెద్ద ఆఫర్ ఒక్కటీ లేదు. ఆ క్రమంలోనే ‘అదా కి అదా’ పేరుతో ట్విట్టర్‌లో ఇన్‌స్టాలో బోలెడంత హంగామా క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియా క్వీన్‌గా నిరంతర ఫొటో షూట్లతో వేడెక్కిస్తూ యూత్‌కి టచ్‌లో ఉంది. అయినా టాలీవుడ్‌లో మాత్రం మరో అవకాశం దక్కించుకోలేకపోయింది. ఎట్టకేలకు హీరో రాజశేఖర్ సరసన కల్కి చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ ఛాన్స్ దక్కినందుకు ఆదా చాలానే ఉబ్బి తబ్బిబ్బవుతోంది. పెద్ద ప్రాజెక్టులో కథానాయికగా అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.