నాని.. ఎవరితోనంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని- విక్రమ్‌కుమార్‌ల కాంబో మూవీని అశ్వినీదత్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. వీరిద్దరి కాంబో మూవీని మహేష్ సోదరి మంజుల కూడా నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మనం, 24లాంటి విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌కుమార్‌తో మెగా హీరో అల్లు అర్జున్ ఒక చిత్రం చేయాల్సి వుంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే గత సమ్మర్‌లోనే వీరిద్దరి కాంబినేషన్ మూవీ పట్టాలెక్కాల్సి వుంది. కాని బన్నీ ‘నా పేరు సూర్య’ చిత్రం నిరాశపర్చడంతో తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే విక్రమ్‌కుమార్ రెడీ చేసిన కథకు పలు మార్పులు చేర్పులు చేయిస్తూ వచ్చాడు. త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్న బన్నీ, తాజాగా విక్రమ్ కుమార్‌ను పక్కన పెట్టడంతో అల్లు అర్జున్‌తో ఎట్టి పరిస్థితుల్లో సినిమా చేయాలనే పట్టుదలతో వున్న విక్రమ్‌కుమార్, ఒకవైపు వక్కంతం వంశీతో కలిసి కథ రెడీ చేస్తూనే గ్యాప్‌లో నానితో చిత్రాన్ని చేసేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే నాని-విక్రమ్‌కుమార్‌ల కాంబోలో మూవీ వార్తలు వచ్చాయి.