అందమైన నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు చమక్కు మనిపిస్తారు. కాలం కలిసొస్తే -స్టార్ హోదా అందుకుంటారు. ఇప్పుడు టైం -నిధి అగర్వాల్‌దే అంటున్నారు కుర్రాళ్లు. చైతూ కెరీర్‌కు ఇటీవల వచ్చిన సవ్యసాచి ఎంతవరకూ కలిసొచ్చిందో తెలీదుకానీ, నిధికి మాత్రం బాగా వర్కౌటైనట్టే కనిపిస్తోంది. ఈ బక్చపల్చని అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయిపోతున్నారు. ఒక్క సినిమాతోనే గ్లామర్‌పరంగా హండ్రెడ్‌పర్సంట్ మార్కులు కొట్టేసిన నిధికి -అవకాశాలు వెల్లువెత్తడం ఖాయమనే అనిపిస్తోంది. అన్న సినిమాలో అందాలతో మురిపించిన నిధి -తమ్ముడి సినిమాలో ఇంకెన్ని మార్కులు సంపాదించనుందోనని ఆశ పడుతున్నారు కుర్రాళ్లు. నెక్స్ట్ ప్రాజెక్టుగా అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ చేస్తోంది నిధి అగర్వాల్. అభినయం మాటెలావున్నా, అచ్చమైన హీరోయిన్ ఆహార్యంతో ఆకట్టుకున్న నిధిని తమ చిత్రాల్లో తీసుకోమంటూ కొత్త హీరోల నుంచి దర్శక, నిర్మాతలపై వత్తిడి పెరుగుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. దర్శక, నిర్మాతలు నిధి డేట్స్ వేటలో పడ్డారట కూడా. ‘మిస్టర్ మజ్ను’ కనుక వర్కౌటైతే, నిధితో కొత్త జనరేషన్ మొదలైనట్టే. అలవాటైపోయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గి, నిధిలాంటి ‘బ్యూటీ’లను దర్శక, నిర్మాతలు వెతకడం ఖాయం.

మెగా హీరో సరసన

మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నాడని తెలిసిందే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్, వైష్ణవ్‌కు జోడీగా నటించనుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఇక వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు.