వైవిధ్యానికే నా సపోర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు బ్యాక్ సపోర్ట్ అవసరం లేదు. కానీ వైవిధ్యం, విభిన్న చిత్రాలకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది అంటున్నాడు నిర్మాత సురేష్ బాబు. పంది పిల్ల ప్రధాన పాత్రగా రవిబాబు తెరకెక్కించిన చిత్రం -అదుగో. బుధవారం ఆడియన్స్ ముందుకొస్తున్న నేపథ్యంలో, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్‌బాబు మీడియాతో మాట్లాడారు. అల్లరి సినిమా నుంచీ రవిబాబు మాతో ట్రావెల్ అవుతున్నాడు. ఉన్నట్టుండి ఓ కథ చెబుతాడు. నచ్చితే సినిమా తీస్తుంటాను. అలానే ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. లైవ్ యాక్షన్ యానిమేషన్ కానె్సప్ట్ బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ జోనర్ నాకూ ఇష్టమే. అందుకే ముందుకెళ్లాం అన్నారు. ‘ముందు 3డీ యానిమేషన్‌లో చేయాలనుకున్నా, ఎగ్జిక్యూషన్‌లో డిఫికల్ట్ అని అర్థమైంది. ఒకదశలో ఔట్‌పుట్ బాగా అనిపించకపోవడంతో వదిలేద్దామని చెప్పా. కానీ రవిబాబు మనం చేయగలమని నమ్మకంగా చెప్పాడు. సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లు లైఫ్‌ను ఫణం పెట్టాడు. సినిమా మొత్తం రవిబాబే చూసుకున్నాడు. ఫలితం ఏంవచ్చినా, ఆ క్రెడిట్ అతనిదే’ అన్నారు. ‘లైవ్ పిగ్‌ను సృష్టించి, దానికి మానవ సంబంధాలు ముడిపెట్టి తీసిన సన్నివేశాలు చాలా కష్టమైంది. వాటికోసమే ఎక్కువ టైమ్ వెచ్చించాం. ఎన్‌ఐడీ కంపెనీ వాళ్లు ముందు ఒప్పుకుని తర్వాత చేతులెత్తేశారు. తరువాత వివిధ కంపెనీల సహకారంతో బెటర్ ఔట్‌పుట్ తీసి రూపొందించాం. బడ్జెట్ పరిమితి దాటిపోయినా, ఇదో ప్రయోగం అన్న ఆలోచనతోనే రిస్క్ చేశాం. మొత్తం ఔట్‌పుట్ చూశాక సంతృప్తికరంగా ఉంది’ అన్నారు. ‘హాలీవుడ్‌స్థాయి టెక్నాలజీని మనమూ క్రియేట్ చేయగలం. కాకపోతే ఎవరూ ఆ దిశగా దృష్టిపెట్టడం లేదు. కొత్త ప్రతిభ, విభిన్న కథా చిత్రాలకు బ్యాక్ సపోర్ట్‌నిస్తాను.
బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ కమర్షియల్ సినిమాలతోపాటు భిన్నమైన సినిమాలు చేస్తున్నారు. సల్మాన్ ఇప్పుడు కొత్త తరహా మాస్ హీరో. షారూఖ్ ఇప్పటికీ తనని తాను మార్చుకునే పనిలో ఉన్నాడు. ప్రతిచోట మార్పు కనిపిస్తుంది. నిర్మాణంలో అలాంటి మార్పులే తీసుకొస్తున్నాం. ఇకపై మేం తీసే సినిమాలు టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో ఉండనున్నాయి. ప్రస్తుతం మా బ్యానర్‌లో మహేంద్ర అనే నూతన దర్శకుడితో పూర్తి తెలంగాణ యాసతో ‘దొరసాని’ చేస్తున్నాం. రవికాంత్ దర్శకత్వంలో ఓ సినిమా, నందినిరెడ్డి, సమంత కాంబినేషన్‌లో కొరియన్ చిత్రం ‘మిస్‌గ్రాన’ రీమేక్ చేస్తున్నాం. ‘వెంకీ మామ’ త్వరలో ప్రారంభమవుతుంది. అలాగే వెంకీ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, తరుణ్ భాస్కర్‌తో మూడు ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నాం. గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ చిత్రం ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుంది. దాన్ని అంతర్జాతీయస్థాయి సినిమాగా తీయాలనుకుంటున్నా. రానా ఈ ప్రాజెక్టును డీల్ చేస్తున్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. ఓ రియల్ ఇన్సిడెన్స్ బేస్ట్‌గా బయోపిక్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆడియెన్స్ అభిరుచి మారుతుంది. థియేటర్‌కి వచ్చి చూసే ఆడియెన్స్ శాతం పడిపోయింది. దీంతో సింగిల్ థియేటర్ల మనుగడ కష్టంగా మారింది. మల్టీ ఫ్లెక్స్ తరహాలో పర్సెంటేజీ ప్రకారం చేస్తే మనుగడ సాధ్యమవుతుంది. అలా చేయాలని కోరుతున్నాం. పెద్ద నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఇలానేవుంటే థియేటర్లకు గడ్డుపరిస్థితి నెలకొంటుంది’ అన్నారు.