సమస్యల్లో షారుక్ జీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జీరో’. ఫిలిం మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. షారూఖ్‌ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఒక వివాదంలో కూడా చిక్కుకుంది. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సిక్కు గురుద్వార్ కమిటీ జనరల్ సెక్రటరీ మజిందర్ సింగ్ సిర్పా ఢిల్లీ పోలీసు స్టేషన్‌లో మంగళవారంనాడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. షారుఖ్‌తోపాటు చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌పై ఆయన కేసు నమోదు చేశారని సమాచారం. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గట్రాకిర్సాన్ (చిన్న కత్తి లేదా పిడిబాకు)ను షారుఖ్ ఈ సినిమాలో ధరించాడని, సంప్రదాయం ప్రకారం అది అమృతధారి సిక్కులు మాత్రమే ధరించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది సిక్కులను కించపరచడమేనని ఆయన అంటున్నారు. కాబట్టి సిక్కులకు అభ్యంతరకరమైన సన్నివేశాలను జీరో సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సిక్కులను అవమానించినందుకు హీరో దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.