ఫ్యాన్సీ రేటుకి తెలుగు ఓడియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూవీ లెజెండ్ మోహన్‌లాల్ మలయాళంలో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఓడియన్’. ఈ చిత్రానికి తెలుగు ట్రేడ్‌లోనూ మంచి క్రేజ్ వచ్చింది. యోగా, వ్యాయామాలతో 35 ఏళ్ల యువకుడిలా మోహన్‌లాల్ తన శరీరాన్ని మార్చుకుని నటించిన చిత్రం కావటం.. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో నిర్మిస్తుండటంతో ప్రాజెక్టుకి సౌత్ ఇండియాలో పెద్ద క్రేజ్ వచ్చింది. టాలీవుడ్‌కి సంబంధించి దగ్గుబాటి అభిరామ్, సంపత్‌కుమార్ ఈ చిత్రం తెలుగు హక్కులు సాధించారు. చిత్రాన్ని మలయాళం, తెలుగులో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మోహన్‌లాల్ స్టామినా చాలా సినిమాల్లో చూసాం. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో నటిస్తున్న ఓడియన్ తెలుగు హక్కుల్ని దగ్గుబాటి క్రియేషన్స్ సొంతం చేసుకుంది. మోహన్‌లాల్‌ను దర్శకుడు శ్రీ కుమార్‌మీనన్ 35ఏళ్ల కుర్రాడిలా వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి అన్నారు.