స్క్రీన్ ప్లే హైలెట్‌గా లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానె్సప్ట్ ఓరియెంటెడ్ కథలు ఆకట్టుకుంటున్న ట్రెండ్‌లో ‘లా’ మూవీ ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. కమల్ కామరాజ్, వౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్ పోషించిన చిత్ర ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్మాత రాజ్‌కందుకూరి చేతులమీదుగా జరిగింది. రాజ్ కందుకూరి మాట్లాడుతూ ట్రైలర్ ఇంప్రెసివ్‌గా వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ‘లా’ అంటే కోర్టు రూం డ్రామా అనుకున్నాను కానీ ట్రైలర్ నన్ను సర్‌ప్రైజ్ చేసింది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ వౌర్యాణి మాట్లాడుతూ నేను చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రం. నాకు ఇలాంటి కథలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు గగన్‌కి థాంక్స్. కమల్ అందించిన సహకారం మర్చిపోలేనన్నారు. పూజా రామచంద్రన్ మాట్లాడుతూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకు ఇలాంటి రోల్ ఇచ్చిన దర్శకుడు గగన్‌కి థాంక్స్. సినిమా మీకు నచ్చుతుందని నమ్ముతున్నానన్నారు. దర్శకుడు గగన్ గోపాల్ ముల్కా మాట్లాడుతూ హీరో కమల్ అందించిన సహకారం మరిచిపోలేను. హీరోయిన్స్ వౌర్యాణి, పూజల సహకారంతో 30 రోజుల్లో పూర్తిచేయగలిగాం. నిర్మాత రమేష్ ఖర్చు కోసం ఆలోచించలేదు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి. బాగోపోతే వందమందికి చెప్పండి కానీ దయచేసి సినిమాని చూడండి అన్నారు. హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ హీరోగా మళ్లీ రీ లాంచ్ అంటున్నారు. అవేమీ నేను పెద్దగా నమ్మను. ఈ సినిమాలో మొదటి హీరో స్క్రీన్‌ప్లే. అదే మమ్మల్ని సినిమా చేసేందుకు ముందుకు తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరూ ‘లా’ని ఫాలో చేయకపోవడం హీరోయిజం అనుకుంటాం. బేసిక్ కామన్‌సెన్స్ వాడితే అందరూ లాని ఫాలో అయినట్లే. సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నానన్నారు. నవంబర్ రెండోవారంలో విడుదలకానున్న ‘లా’ చిత్రంలో మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్ ముఖ్య పాత్రలు పోషించారు.