డబ్బింగ్.. చెప్పేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ -అమర్ అక్బర్ ఆంటోనీతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా, తొలిసారి డబ్బింగ్ సాహసం చేసింది. పాత్ర డిమాండ్ చేయడంతో ఇలియానా పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీను వైట్ల ప్లాన్ చేయడంతో, నాలుగు రోజుల్లోనే డబ్బింగ్ పార్ట్‌ని ఇలియానా పూర్తి చేయడం విశేషం. రవితేజ, ఇలియానా పెయిర్‌కు మంచి క్రేజ్ ఏర్పడటంతో, రీ ఎంట్రీ కోసం రవితేజతో నాలుగోసారి జోడీ కట్టింది ఇలియానా. మాస్ మహారాజ్ రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీమేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ 10న గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా, రెండవ పాటను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్న ఈ సినిమా సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కగా ఈ చిత్రంలో లయ, సునీల్, వెనె్నల కిశోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యుసింగ్, విక్రమ్‌జిత్, రాజ్‌వీర్‌సింగ్, శుభలేఖ సుధాకర్, షాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా, వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.