నులివెచ్చని నెగడులా.. పల్లెవాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిషాల్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి రామ్‌ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం -పల్లెవాసి. గోరంట్ల సాయినాథ్ దర్శకుడు. గీత రచయిత వెనె్నలకంటి కొడుకు రాకేందువౌళి హీరోగా చేస్తుంటే, అతని సరసన కల్కి హీరోయిన్‌గా కనిపించనుంది.
షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు సాగుతున్న నేపథ్యంలో దర్శకుడు సాయినాథ్ మీడియాకు వివరాలు వెల్లడించాడు. వినాయక చవితికి విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమా టైటిల్ ఆసక్తిపెంచేదిగా ఉందంటూ ఫీడ్‌బ్యాక్ వస్తోందని వెల్లడించాడు. అనూహ్య స్పందనతో సినిమాపై నమ్మకం పెరిగిందని అంటూనే, హీరో రాకేందువౌళి నటన అందరినీ కట్టిపడేస్తుందన్నాడు.
సందీప్ అందించిన స్వరాలకు వెనె్నలకంటి, రాకేందువౌళి సాహిత్యం చక్కగా కుదిరిందని, కథలో భాగంగా వచ్చే పాటలు అందరినీ అలరిస్తాయన్నాడు. వేసవిలో కుండనీటిలా, శీతలంలో చలిమంటలా, కరువు నేలలో పండిన వేరుశనగంత రుచిగా, తొలకరికి నేల పరిమళమంత కమ్మటి అనుభూతిని ‘పల్లెవాసి’ కలిగిస్తుందన్నారు. నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ‘పల్లెవాసి’ని ప్రేక్షకుల ముందుకు తెస్తామన్నారు. చిత్రానికి రచన, నిర్మాత జి రాంప్రసాద్, కెమెరామెన్ లక్ష్మణ్, సంగీతం కె సందీప్‌కుమార్, ఎడిటర్ జానకిరామ్.