సరోజాదేవిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినీవర్గాల నుంచి అందుతోన్న తాజా సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఓ ముఖ్య హీరోయిన్ పాత్రను అనుష్క శెట్టి చేయబోతోందట. ఆమె ఎవరో కాదు, బి సరోజాదేవి. ఎన్టీఆర్ సినీ జీవితంగా తెరకెక్కుతున్న ‘కథానాయకుడు’లో బి సరోజాదేవిగా అనుష్క కనిపించబోతోందన్న మాట. అప్పట్లో ఎన్టీఆర్ పక్కన బి సరోజాదేవి చాలా చిత్రాలు చేశారు. వాటిల్లో సూపర్ హిట్లూ ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ నేపథ్యాన్ని బయోపిక్‌లో చిత్రీకరిస్తారట. త్వరలో జరగబోయే షెడ్యూల్‌లోనే అనుష్కశెట్టిపై చిత్ర బృందం ఆ సన్నివేశాల తాలూకు భాగాలను చిత్రీకరించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న చిత్రం జనవరి 9న విడుదల కానుండటం తెలిసిందే. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలు.
‘్భగమతి’ తర్వాత అనుష్కనుంచి కొత్త సినిమా ప్రకటనే కరవైంది. అయతే, కోన వెంకట్ అందించిన కథతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మాధవన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో మాధవన్‌కు జోడీగా అనుష్క నటించనున్నారని తెలుస్తోంది. 2019లో అమెరికాలో చిత్రీకరణ మొదలుకానున్నట్లు ఆ చిత్ర రచయత కోన వెంకట్ ప్రకటించారు. ‘వస్తాడు నా రాజు’ ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో అనుష్క చేయనుందని సమాచారం. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గడం కోసం విదేశాల్లో నేచురల్ థెరపీలో నిమగ్నమై ఉంది.