సైంటిఫిక్ స్టోరీతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మాస్ హీరో రవితేజ హీరోగా విఐ ఆనంద్ ప్రాజెక్టు ఖరారైంది. నిర్మాత రామ్ తాళ్లూరి భారీగా నిర్మించనున్న ప్రాజెక్టును 13న అధికారికంగా ప్రకటించనున్నారు. రవితేజ, వీఐ ఆనంద్ క్రేజీ కాంబినేషన్‌పై అప్పుడే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. 13న టైటిల్ ప్రకటించి లోగోను లాంచ్ చేయనున్నారు. రవితేజ తన కెరీర్‌లో తొలిసారి సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో చేయబోతున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ రవితేజతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో ఓకే చేసి ప్రాజెక్ట్‌ని ప్రారంభించాలని నిర్ణయించాం. రవితేజ ఇప్పటివరకు టచ్‌చేయని జానర్‌లో సినిమా తెరకెక్కనుంది. ఓ సైంటిఫిక్ కథలో మొదటిసారిగా రవితేజ నటించనున్నాడు. మా బ్యానర్ వాల్యూని మరింత పెంచేలా చిత్రాన్ని నిర్మించబోతున్నాం. చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటున్నాం. అన్నివర్గాల్ని ఎంటర్‌టైన్ చేసేలా సినిమా ఉంటుంది. నవంబర్ 13న సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించడంతోపాటు లోగోని లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.