లిసాగా భయపెడతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న అంజలి మరో వైవిధ్యమైన పాత్రతో వస్తోంది. ఆ చిత్రమే ‘లిసా’. పీజీ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘లిసా’ దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు. అదీ 3డిలో అయితే మరింత కష్టం. కానీ పిజి ముత్తయ్య ఫ్రేమ్స్‌వల్ల చిత్రం శరవేగంగా పూర్తయ్యింది. టైటిల్ రోల్‌లో అంజలి తన పాత్రకి న్యాయం చేసింది. నటుడు సామ్ జోన్స్ మంచి పాత్ర చేశారు. ఇక మకరంద్ దేశ్‌పాండే యాక్టింగ్ స్కిల్స్ చూసి సెట్‌లో అందరూ ఆశ్చర్యపోయారు. బ్రహ్మానందాన్ని డైరెక్ట్ చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నటి సలీమా రెండు దశాబ్దాల క్రితం తెలుగు, కన్నడలో హీరోయిన్‌గా చేశారు. ఆమెను చిత్రంలో నటించమని అడగ్గానే వెంటనే ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ లిసాకు నిర్మాణ బాధ్యతతోపాటుగా సినిమాటోగ్రాఫర్‌గానూ వ్యవహరించా. ప్రస్తుత డబ్బింగ్ జరుగుతోంది. తాజాగా అంజలితో ‘లిసా’ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డి హారర్ మూవీగా సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరించాం. చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేస్తున్నాం అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ దయానిధి మాట్లాడుతూ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ మొదటిసారి 3డి చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజుకు స్క్రిప్ట్‌పై క్లారిటీ ఉంది. ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా చూపించడమే కాకుండా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా నిర్మించారు. సంతోష్ అందించిన బాణీలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇలాంటి మంచి ప్రొడక్షన్ పనిచేయడం కంఫర్ట్‌గా, హ్యాపీగా ఉంది అన్నారు.