తమన్నా సందీప్‌ల నెక్స్ట్ ఏంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ గాళ్ తమన్నా, యంగ్ హీరో సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్స్ట్‌ఏంటి’? బాలీవుడ్‌లో ‘్ఫనా’, ‘హమ్ తుమ్’లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్, పూనమ్‌కౌర్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. లండన్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోగా సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని, టీజర్ రిలీజ్ డేట్‌ని చిత్ర నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్‌చంద్ర భట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్‌పూరి నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు. తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్‌బాబు, పూనమ్‌కౌర్, లారిస్సా తదితరులు నటిస్తున్నారు.