చిక్కువీడిన సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంటీ గవర్నమెంట్ ఎపిసోడ్స్ అపవాదు ఎదుర్కొంటున్న తమిళ స్టార్ విజయ్ ‘సర్కారు’ -చివరకు చిక్కులనుంచి వెనక్కి తగ్గింది. ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన చిత్రంలో ఉద్దేశపూర్వకంగా అన్నాడీఎంకె వ్యతిరేక సన్నివేశాలు డిజైన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు కొద్దిరోజులుగా వివాదాన్ని రేపుతోన్న విషయం తెలిసిందే. మురగదాస్ సహా చిత్రబృందంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు పడటంతో, వివాదం ముదిరే పరిస్థితి తేవడం అనవసరం అనుకున్న మురుగదాస్ టీం -కొన్ని సీన్లు తొలగించేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ‘సర్కార్’పై కొద్దికాలంగా అన్నాడీఎంకె నేతలు షణ్ముగన్, కాదంబూర్ రాజు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. సినిమాలో ఓటర్లను ప్రలోభపెట్టే సన్నివేశాలు, యాంటీ గవర్నమెంట్ ఎలిమెంట్స్‌ను తప్పించాలంటూ వివాదాన్ని రేపారు. పోస్టర్లు చించేసి, ఆందోళనకు దిగడంతో వివాదం రాజుకుంది. దీనికితోడు న్యాయస్థానాల్లో పిటీషన్లూ పడ్డాయి. మురగదాస్ అరెస్ట్‌ను సైతం డిమాండ్ చేయడంతో, దర్శకుడు ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం సన్నివేశాలు తొలగించాలంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, ఏయే సన్నివేశాలను తొలగిస్తున్నారన్నది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇదిలావుంటే, వివాదంపై రజనీకాంత్ ట్వీట్ చేస్తూ ‘సెన్సార్ అనుమతులు సాధించిన చిత్రంలోని సన్నివేశాలను తొలగించమని డిమాండ్ చేయడం అనైతికం. ఈ ధోరణిని ఖండిస్తున్నా’ అని పేర్కొన్నారు. జాతీయ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ ‘సర్కార్‌ను సెన్సార్ ఓకే చేసింది. అయినా సినిమా పట్ల ఈవిధమైన ప్రవర్తన క్షేమదాయకం కాదు. విమర్శలను ఎదుర్కోగలిగే ధైర్యంలేని పార్టీలే ఇలా చేస్తాయి’ అని ట్వీట్ చేశారు.