శరవేగంగా ప్రేమమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన తరాగణంగా చందు మొండేటి దర్శకత్వంలో సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశి రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిర్మాత మాట్లాడుతూ, ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, మాతృకకన్నా తెలుగుదనం ఉట్టిపడే మార్పులుచేర్పులు చేశామని, వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ‘ప్రేమకథలకు ముగింపు ఉంటుంది కానీ.. అనుభూతులకు ఉండదు’ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర మూడు వైవిధ్యమైన కోణాల్లో కనిపిస్తుందని, ఆ మూడు ఒకదానికి ఒకటి పాత్రోచితంగా, విభిన్నంగా సాగుతూ ఆసక్తిగా ఉంటాయని దర్శకుడు చందు మొండేటి అన్నారు. మూడు ప్రేమకథలు సమ్మిళంగా ప్రతి కథా ఎంతో నవ్యతతో సాగే ఈ ప్రేమమ్ అందరికీ నచ్చుతుందని, నాగచైతన్య, శృతిహాసన్‌ల జోడి ప్రేక్షకులకు హైలెట్‌గా ఉంటుందని, కథలో పలు మార్పులు చేశామని ఆయన అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ప్రేక్షకుల ముందుకు రానున్నామని అన్నారు. జీవ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవింద్‌కృష్ణ, సత్య, కార్తిక్, ప్రసాద్, నోయల్, ఈశ్వర్‌రావు, జోగినాయుడు, కృష్ణంరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, రాజేష్ మురుగేశన్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: అనల్ అర్సు, కథ: ఆల్ఫోనే్స పుథరిన్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చందు మొండేటి.