నాయనమ్మగానూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత కెరీర్‌పరంగా స్పీడ్‌మీదున్న సంగతి తెలిసిందే. వరుసగా సోలో నాయికగా పెర్‌ఫార్మెన్స్‌కు ఆస్కారం వున్న కథల్ని ఎంచుకుని సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు భర్త నాగచైతన్యతో కలిసి సినిమాలకు కమిటవుతోంది. ఇటీవలే రిలీజైన శామ్ ‘యూ టర్న్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. తన కెరీర్‌కు ఇది తొలిమెట్టు అని భావిస్తోందట. తదుపరి శివనిర్వాణ దర్శకత్వంలో చైతూ సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాతోపాటు మరో నాయికా ప్రధాన చిత్రానికి సామ్ కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ కీలక సమాచారం లీకైంది. ఇది ఓ కొరియన్ చిత్రానికి అధికారిక రీమేక్. ‘మిస్ గ్రానీ’ అనేది టైటిల్. నాయనమ్మ- మనవరాలు మధ్య సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో సామ్ నాయనమ్మగా మనవరాలుగా ద్విపాత్రాభినయం చేసేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. అంటే ఇటీవలే బాలీవుడ్ నాయిక అనుష్క శర్మ చేస్తున్న ప్రయోగాల తరహాలోనే సామ్ తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందిట.
ఇప్పటికే నందిని రెడ్డి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. తనే స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ప్రతిష్ఠాత్మక సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో తన కెరీర్‌ని మలుచుకునే ప్లాన్‌లో ఉన్నారు కాబట్టి, హిట్టిస్తే మరో కీలక మలుపు అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా అధికారిక రీమేక్ విషయాన్ని నిర్మాత డి.సురేష్‌బాబు వెల్లడించారు. ఈ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడిగా నటించనున్నారు.