క్రిష్‌తో మహేష్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం. ఈ సినిమా పూర్తికాగానే మహేష్ 26వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉంటుంది. ఇక మహేష్ 27వ చిత్రం గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తారు. ఈ సినిమాకు సందీప్ వంగాను దర్శకుడిగా అనుకుంటున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. కాని ఈ ప్రాజెక్టులో భారీ మార్పుచేసుకోనుందట. సందీప్ వంగా స్థానంలో క్రిష్‌ను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడట. క్రిష్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే మహేష్ 27పై వర్క్ మొదలుపెడతాడని అంటున్నారు. క్రిష్ గతంలో మహేష్‌బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ‘శివం’ పేరుతో ఒక స్క్రిప్ట్ తయారుచేసుకుని మహేష్‌ను కలిశాడని అన్నారు కానీ ఎందుకో అది వర్కవుట్ కాలేదు. క్రిష్ ఎంచుకునే సబ్జెక్టులు క్లాసీగా ఉంటాయి. కానీ మహేష్‌బాబుకు సూటయ్యే కమర్షియాలిటీ వున్న స్క్రిప్ట్‌ను తయారుచేయగలడా లేదా అనేది కూడా సందేహమే.