మెగా ప్రాజెక్టుకు హ్యుమా ఖురేషి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ ఒకవైపు జరుగుతూనే ఉండగా మరోవైపు 152వ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భరత్ అనే నేనుతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని దక్కించుకున్న కొరటాల శివ చిరంజీవి తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక చర్చలు జరుపుతున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం. 150లో కాజల్ నటించగా, ప్రస్తుతం చేస్తున్న సైరాలో నయనతార హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ముందు శ్రీయ, అంజలి, అనుష్క మినహా పెద్దగా ఎవరూ లేరు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లేదంటే, మళ్లీ కాజల్‌ను చిరంజీవికి జోడీగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని అంతా భావించారు. అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించాలని భావిస్తున్నాడట. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషిని చిరంజీవి చిత్రం కోసం సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా ఓకె చెప్పిందంటూ సినీ వర్గాలద్వారా తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే చిరు 152వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని మెగా సన్నిహితులు చెబుతున్నారు.