‘వినయ విధేయ.. రామ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ ‘వినయ విధేయ రామ’ టీజర్ విడుదలైంది. ‘అన్నయ్యా వీడిని చంపేయాలా? భయపెట్టాలా? భయపెట్టాలంటే పది నిమిషాలు.. చంపేయాలంటే పావుగంట. ఏదైనా ఓకే. సెలెక్ట్ చేస్కో’ అంటూ చరణ్ పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ‘రేయ్... పందెం పరశురాం అయితే ఏంట్రా. ఇక్కడ రామ్.. రామ్.. రామ్ కొణిదెల’ అన్న మరో డైలాగ్‌ను టీజర్‌లో చూపించారు. ఎస్పీ పరశురామ్ చిత్రంలో రామ్.. పరశురామ్ అంటూ చిరంజీవి డైలాగ్ చెబితే, బద్రి చిత్రంలో బద్రి.. బధ్రినాథ్ అంటూ పవన్‌కల్యాణ్ డైలాగ్ చెప్పిన మాడ్యులేషన్‌తోనే రామ్‌చరణ్ డైలాగ్ చెప్పడం -కమర్షియల్ మ్యానరిజం టచ్ ఇవ్వడానికే అన్నది అర్థమవుతుంది. దర్శకుడు బోయపాటి శ్రీను మార్క్ డైలాగులు, యాక్షన్ ఎడిసోడ్స్ దట్టించారన్న విషయాన్ని బల్లగుద్ది చెప్పడానికే టీజర్‌ను ఇలా డిజైన్ చేసినట్టు అర్థమవుతుంది. రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ అలరించబోతోంది. విలన్ పాత్రను వివేక్ ఒబెరాయ్ చేస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.