అడిగో.. బ్లఫ్ మాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పిస్తున్న చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. అభిషేక్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. సత్యదేవ్, నందితా శే్వత, ఆదిత్య మీనన్ కీలక పాత్రధారులు. గోపి గణేష్ పట్ట్భా దర్శకుడు. రమేష్ పి.పిళ్ళై నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ- ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ, చాలా అద్భుతమైన ఇంప్రూవైజేషన్స్ చేశాం. గోపీ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. ఈ కథ కోసం హీరో కోసం వెతుకుతున్నపుడు సత్య చేసిన కొన్ని సినిమాలు చూశాం. ఈ కథకు తను పక్కా యాప్ట్ అనిపించి ఓకె చేశాం. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేస్తాం. డిసెంబర్ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మంచి సంగీతాన్ని ఇచ్చారు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- మనం చేసే సినిమా ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశ్యంతో సినిమా చేశాను. సమాజంలో బ్లఫ్ మాస్టర్లు చాలా ఎక్కువయ్యారు. దీని ఒరిజినల్ చిత్రం ‘చతురంగ వేట్టై’ను తీసిన డైరెక్టర్‌ను కలిశాను. ఆయన చేసిన ఈ సినిమా తర్వాత చెన్నైలో 40 శాతం క్రైమ్ రేట్ తగ్గిందట. అంతగా జనాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఇది. అందుకే దర్శకుడిని పోలీసులు ప్రత్యేకంగా ప్రశంసించారు అక్కడ. తెలుగులోనూ అదే ఇంపాక్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ఎమోషనల్‌గా ఈ సినిమాకు చాలా కనెక్ట్ అయ్యాను. నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ చిత్రంతో లభించింది. ఈ చిత్రంతో కృష్ణప్రసాద్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.