క్యాన్సర్.. నాకో కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి మనీషా కొయిరాలా క్యాన్సర్‌ను జయంచి ఆరేళ్లవుతోంది. భయానక వ్యాధి తన జీవితాన్ని ఎలా మార్చేసిందో వివరిస్తూ రాసిన పుస్తకానికి ‘హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్’ అనే టైటిల్ పెట్టారు. ఇటీవల ముంబైలో పుస్తకాన్ని విడుదల చేసిన మనీషా ‘కాన్సర్‌తో పోరాటం నాకో గుణపాఠం. అది కఠినమైన పాఠాల నేర్పింది. అంతేకాదు, నాకో కొత్త కానుకనిచ్చింది. కాన్సర్‌తో నా జీవిత ప్రయాణాన్ని పుస్తకం ద్వారా మీతో పంచుకుంటున్నా’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాన్సర్ కారణం సినిమా కెరీర్‌కు దూరమైన ఆమె, పూర్తిగా కోలుకున్నాక మళ్లీ నటిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మనీషా నటించిన చిత్రం ‘డియర్ మాయా’. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ జీవితాధారంగా వచ్చిన సంజులో అలనాటి నటి నర్గిస్‌దత్ పాత్ర చేయడం తెలిసిందే.