22న రానున్న సరైనోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ప్రధాన తారాగణంగా గీతా ఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ రూపొందించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను నేరుగా ఏప్రిల్ 1న మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలో పదో తారీఖున ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, హీరోహీరోయిన్ల స్టెప్పులతో బ్లాక్‌బస్టర్ అనే పాట అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుకను ఏప్రిల్ 10న నిర్వహించనున్నామని, ఈ వేసవికి ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. తమన్ సంగీతంతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ హైవోల్టేజ్ కథను వచ్చే 22న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామని అన్నారు. శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, సురేఖావాణి, విద్యుల్లేఖ, దేవదర్శిని, అంజలి (ప్రత్యేక పాట) తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కెమెరా: రిషి పంజాబి, మాటలు: ఎం.రత్నం, సంగీతం: ఎస్.ఎస్.్థమన్, నిర్మాత: అల్లు అరవింద్, దర్శకత్వం: బోయపాటి శ్రీను.