ఇదో క్రేజీ మల్టీస్టారర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో.. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజవౌళి సినిమా చేయబోతున్నారని ప్రకటించగానే సినిమా ప్రారంభం కాకముందునుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని మెగాభిమానులు, నందమూరి అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తుండగానే ఆ రోజు రానే వచ్చింది. ముందుగానే ప్రకటించిన విధంగా నవంబర్ 11న సినీ ప్రముఖుల సమక్షంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య హైటెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్, రానా, కళ్యాణ్‌రామ్, కొరటాల శివ, దిల్‌రాజు, అల్లు అరవింద్, పివిపి, డి.సురేష్‌బాబు, ఎం.ఎల్.కుమార్ చౌదరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టగా, వి.వి.వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ- మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ టాలీవుడ్‌ను మా బ్యానర్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో రాజవౌళి దర్శకత్వంలో చేయడం ఓ డ్రీమ్‌లాగా ఉంది. సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలున్నాయి. నందమూరి అభిమానులు, మెగాభిమానులు ఎంత ఆతృతతో ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అందరి అంచనాలను మించేలా మేకింగ్‌లో కాంప్రమైజ్ కాకుండా భారీగా రూపొందిస్తాను. సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 19 నుండి ప్రారంభం అవుతుంది. రామ్‌చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో భారీ సెట్‌లో రెండు వారాలపాటు యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, వివరాలను ప్రకటిస్తాం అన్నారు.