రవి.. ట్రబుల్ షూటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో శ్రీను వైట్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సే -శ్రీను.
ఢీ అన్నా.. రెడీ అన్నా.. వినోదాన్ని దూకించాలన్నా.. దర్శకుడిగా శ్రీనుని వెతుక్కోవాల్సిందే.
కామెడీ జోనర్‌లో అతనిదో స్టయల్.
కెరీర్‌లో ఆటుపోట్లు ఎదురైనపుడూ తన కమిట్‌మెంట్ వదులుకోని వైట్ల -ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. హిట్ పెయర్‌గా పేరుపడిన రవితేజ, ఇలియానాలను జంటగా మైత్రీ మూవీస్ స్క్రీన్‌పై చూపించబోతున్నాడు. ట్రిపుల్ ఏగా ఇప్పటికే పాపులరైన ఈ సినిమా ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా
శ్రీను వైట్లతో ఇంటర్వ్యూ..

టెన్షన్‌గా ఉన్నారా?
-లేదు. చాలా నమ్మకంతో ఉన్నా. అమర్ అక్బర్ ఆంటోనీ విషయంలో చాలా కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి రిలాక్స్‌గా ఉన్నా.
గత ఫెయిల్యూర్స్ పరంగా ఒత్తిడి కలగలేదా?
-గతంలో చేసిన తప్పులను చూసి రియలైజ్ అయ్యానని అనుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో గతంలో నేను బిజీగా ఉన్నప్పుడు ఎలా పనిచేశానో అంతకుమించి ఎక్కువ కష్టపడ్డాను.
ఇంతకీ అమర్ అక్బర్ ఆంటోనీ ఎవరు?
-నా గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన కథతో తెరకెక్కిన సినిమా. సరికొత్త జోనర్‌లో ఉంటుంది. ఒక మంచి పాయింట్‌తో తెరకెక్కించాం. రివేంజ్ నేపధ్యంలో సాగుతూనే నా స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది.
రవితేజ కోసమే ఈ కథ రాశారా?
-అవును. కేవలం రవితేజను దృష్టిలో పెట్టుకుని రెడీ చేసుకున్న కథ ఇది.
హీరోయిన్‌గా ఇలియానా చాయిస్ ఎవరిది?
-నేనే అనుకుకున్నా. ఈ సినిమాకోసం ఇలియానా అయితే బావుంటుందని. కానీ ఆమె సినిమాలు చేయట్లేదని అన్నారు. అయినా సరే ఆమెను కలిసి కథ చెప్పాను. కథ నచ్చడంతో ఓకే చెప్పింది.
మీరు చేసిన కొన్ని సినిమాల ఫలితాలు
భారీగా తారుమారయ్యాయి కదా?
-సినిమా విషయంలో భారీ సినిమా, చిన్న సినిమా అనేది నాకు తేడా లేదు. నా మొదటి సినిమా 38 లక్షల బడ్జెట్‌లో తీశాను. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు కూడా చేశాను.
మైత్రీ మూవీస్ గురించి?
-రవితేజతో సినిమా అనుకున్నాక ఈ బ్యానర్‌లోనే చేయాలన్న నిర్ణయానికొచ్చాను. అంతకుముందు ఇద్దరు, ముగ్గురు నిర్మాతలు సినిమా చేస్తామని వచ్చారు కానీ, నాకు ఈ బ్యానర్‌లోనే చేయాలన్న ఆలోచన ఉండడంతో ఇందులో ప్లాన్ చేశాం. వాళ్ల సపోర్ట్‌తో ఈ సినిమా మరో రేంజ్‌కు వెళ్లింది. నిజంగా నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది.
సక్సెస్ ఫెయిల్యూర్‌ని ఎలా తీసుకుంటారు?
-నాకు సినిమా అంటే పిచ్చి, తప్ప ఇమేజ్ రావాలి, కీర్తి రావాలి అనే ఆకాంక్ష లేదు. నా జయాపజయాలను సీరియస్‌గా తీసుకోను. సక్సెస్‌లో ఉన్నప్పుడు అందర్నీ నా చుట్టూ చేర్చుకోను. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎవరూ లేరని బాధపడను. అందుకే నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను.
రవితేజతో మీ జర్నీ?
-రవితేజ నాకు మంచి మిత్రుడే కాదు నా ట్రబుల్ షూటర్ కూడా. నేను డౌన్‌లో ఉన్నప్పుడు వెంకీ సినిమా చేద్దామన్నారు. ఆ సినిమా తర్వాత నాకు పేరొచ్చింది. ఆ తర్వాత ఢీ సినిమా చేశాను. అది రిలీజ్ అవుతుందో కాదో అన్న సందేహంలో ఉన్నప్పుడు దుబాయ్ శీను చేద్దామన్నాడు. తను ఎప్పుడూ నన్ను దర్శకుడిగానే నమ్ముతాడు. ఫోన్ చేసి మనం తొందరలోనే సినిమా చేస్తున్నాం అబ్బాయ్ అని రెడీ అవ్వమని చెబుతాడు.
సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ మీ పైనే ఎక్కువగా ఉంటుంది. దానె్నలా రిసీవ్ చేసుకుంటారు?
-సినిమా సక్సెస్ అయితే ఓకే. కానీ ఫెయిలైతే ఆ రెస్పాన్స్‌బులిటీ దర్శకుడిపైనే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సిద్ధమవుతాను. ఒక కథను ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకుడికి అందించడం చాలా కష్టం. ఆ కష్టాన్ని నేను ఇష్టంగా భావిస్తాను.
ఈమధ్య మీ సినిమాల్లో
మీ మార్క్ కామెడీ తగ్గిందంటున్నారు?
-ఔను నాకూ అలాగే అనిపించింది. గత మూడు చిత్రాల తాలూకు రెస్పాన్స్ అలాగే వుంది. అందుకే ఈ సినిమాలో రెట్టింపు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించాం. ముఖ్యంగా సునీల్ పాత్ర చాలా బావుంటుంది. తను బేబీ సిట్టర్ బాబీలా కనిపిస్తాడు.
ఆమధ్య బాలీవుడ్‌లో సినిమా చేస్తానని అన్నారు?
-ఔనండి. ఢీ టైంలో ఆ సినిమా హక్కుల్ని హిందీ వెర్షన్‌కోసం శతృఘ్నసిన్హా తీసుకున్నారు. నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ అది తీయడం కుదరలేదు. ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
మళ్ళీ రవితేజతో సినిమా ఎప్పుడు?
-రవితేజతో సినిమా అనేది ఎప్పుడైనా ఉండొచ్చు. తను కామెడీ కాదు మంచి పొటెన్షియల్ ఉన్న నటుడు. ఈ సినిమాలో అతన్ని బాగా వాడేశా. తప్పకుండా కొత్త రవితేజను చూస్తారు. ఇక నెక్స్ట్ సినిమా విషయంలో ఓ కథ సిద్ధం చేస్తున్నా.

-శ్రీనివాస్ ఆర్.రావ్