హోరెత్తించిన పార్టీ సాంగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి.శివ నిర్మించిన చిత్రం పార్టీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జై, రెజీనా కాసాండ్రా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి, చంద్రన్, సంపత్‌రాజ్, శివ, చంద్రన్, తదితరులు నటిస్తున్నారు. ప్రేమ్‌జి అమరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందజేశారు. ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తిచేసుకుని హైదరాబాద్‌లో ఆడియో లాంచ్ జరిగింది. ప్రొడ్యూసర్ టి శివ మాట్లాడుతూ మంచి చిత్రాన్ని తీసానని ఆనందపడుతున్నాను. డైరెక్టర్ బాగా తీశారు. ఇకముందూ ఈ డైరెక్టర్‌తో కలిసి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఇది నా 8వ చిత్రం. నేను ఇదే బ్యానర్‌లో మరో చిత్రంకూడా చేస్తున్నాను. స్టోరీ లైన్ కొంచం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. డీమానిటైజేషన్ జరిగినప్పుడు పడిన ఇబ్బందులతో చేసిన కథ ఇది. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేసారన్నారు. సంచిత మాట్లాడుతూ ఇది నా రెండో చిత్రం. నా పాత్ర యూనిక్‌గా ఉంటుంది. అంతేకాదు, ప్రతి క్యారెక్టర్‌కీ ప్రత్యేకత ఉంటుందన్నారు. ఆర్‌ఎక్స్100 దర్శకుడు అజయ్‌భూపతి మాట్లాడుతూ వీళ్ళు నన్ను అతిథిగా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూశాను బావున్నాయి. ఇందులో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్‌కి మంచి పేరురావాలని కోరుకుంటున్నా. కట్టప్పా, శివగామిల రొమాన్స్ చూడాలంటే పార్టీ సినిమా చూడాల్సిందే అన్నారు. యాక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన శివ, ప్రభుకి కృతజ్ఞతలు. కట్టప్ప మనవడిగా ఇంట్రడ్యూస్ చేశారు. మీరందరూ తప్పక ఆదరించాలి. తెలుగు ఆడియన్స్ సత్యరాజ్‌ని రెండు పాత్రల్లోనే చూశారు. చాలా డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్లలో. ఈ చిత్రంలో కట్టప్ప గ్రాండ్‌సన్‌గా చాలా డిఫరెంట్ పాత్ర చేశాను. రమ్య మాడమ్ ఫస్ట్ చిత్రంలో నేను విలన్‌గా చేశాను. ఈ చిత్రం టోటల్ ఫన్‌గా ఉంటుందన్నారు.