ఉద్యమ సింహం.. ఇలా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పద్మనాయక ప్రొడక్షన్స్‌పై కల్వకుంట్ల నాగేశ్వరావు కథను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉద్యమసింహం’. నటరాజన్ (గిల్లిరాజా), సూర్య, పి.ఆర్.విఠల్‌బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ- ఉద్యమ సింహం టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. నాగేశ్వరరావు ఎంతో ఇష్టంతో కెసిఆర్‌పై సినిమా చేయడం గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా కెసిఆర్ బయోపిక్‌లా అన్ని విషయాలు సినిమాలో చూపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతా చిత్రాన్ని ఆదరించాలని కోరారు. నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ మంచి అవుట్‌పుట్ వచ్చింది. 16న ఆడియో విడుదల చేస్తాం. అతి త్వరలో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. దర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ కథ ఎంత బాగా వచ్చిందో సినిమా కూడా అంతే బాగా వచ్చింది. త్వరలో కెసిఆర్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు? మిగతా నటీనటులు ఎవరు అన్నది రివీల్ చేస్తామని చెప్పారు.