డిసెంబర్ మధ్యలో అనగనగా ఓ ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయమవుతూ థౌజెంట్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో నాయికలుగా రిద్ధికుమార్, రాధా బంగారు నటిస్తున్నారు. కెఎల్‌ఎన్ రాజు చిత్రానికి నిర్మాత. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని ‘యు’ సర్ట్ఫికెట్ పొందింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజు మాట్లాడుతూ చాలా కాలం తరువాత దర్శకుడు ప్రతాప్ చెప్పిన కథ నచ్చి నిర్మించిన చిత్రమే అనగనగ ఓ ప్రేమకథ. హీరో అశ్విన్ చక్కని నటుడు. నాయికలలో ఒకరైన రిద్దికుమార్‌కిది తొలి చిత్రం. ఈ చిత్రం ప్రారంభమైన తొలినాళ్ళలోనే ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించగా విడుదలైన లవర్ చిత్రంలో అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు కె.సి.అంజన్, ఛాయాగ్రాహకుడు ఎదురొలు రాజులకు కూడా ఇదే తొలి చిత్రం. కొత్తవారితో ఓ మంచి చిత్రాన్ని నిర్మించానన్న నమ్మకం తొలి కాపీ చూసినపుడు, సెన్సార్ ప్రశంసలు అందుకున్నపుడు కలగటమే కాదు సగటు ప్రేక్షకుడికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం పెరిగింది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకముంది అన్నారు. డిసెంబర్ రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రీ రిలీజ్ వేడుక వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.