ఎన్టీఆర్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ-క్రిష్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుంది. సంక్రాంతికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదలకు సిద్ధం అవుతోంది. రిపబ్లిక్ డేకు ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల కావాల్సి వుంది. రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను డిసెంబర్ రెండవ లేదా మూడవ వారం వరకు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఎంతోమంది స్టార్స్‌ను నటింపజేస్తున్న దర్శకుడు క్రిష్ మరో కీలక పాత్ర కోసం శ్రీయను ఈ చిత్రంలో నటింపజేస్తున్నట్లుగా సమాచారం. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంకు సంబంధించిన కొన్ని సీన్స్ ఎన్టీఆర్ మూవీలో ఉంచబోతున్నారట. అందుకే ఆ సీన్స్ కోసం కీలక పాత్రలో శ్రీయ కనిపించబోతున్నట్లుగా తెలిసింది. శ్రీయతో దాన వీర శూరకర్ణ చిత్రం ఎపిసోడ్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా కనిపించబోతున్నాడట. అప్పట్లో హరికృష్ణ దానవీర శూరకర్ణ చిత్రంలో అర్జునుడి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో కళ్యాణ్‌రామ్ అర్జునుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సర్‌ప్రైజ్‌లను క్రిష్ ఇంకా రివీల్ చేయలేదు. త్వరలోనే ఆ పాత్రలకు సంబంధించిన లుక్‌లను విడుదల చేయనున్నాడు బాలయ్య. క్రిష్‌ల గత చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో శ్రీయ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.