నచ్చితే ఏదైనా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ -ఎనర్జీకి బ్రాండ్ అంబాసిడర్ అన్నది టాలీవుడ్ మాట. మాస్ రాజా అని స్క్రీన్ ఐడెంటిటీ సంపాదించుకున్న రవితేజ -నిజంగానే ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటాడన్నది చూస్తేనే తెలుస్తుంది. ఎలా? అన్న ప్రశ్నకు -టెన్షన్స్, నెగెటివ్ థాట్స్ పెట్టుకోకపోవడమే అన్నది రవి ఆన్సర్. ఏ తరహా పాత్రనైనా తనకనుగుణంగా మాడ్యులేట్ చేయగలిగే రవితేజ -తాజాగా అమర్ అక్బర్ ఆంటోనిగా థియేటర్లకు వస్తున్నాడు. నీ కోసం, వెంకి, దుబాయ్ శీను తరువాత దర్శకుడు శ్రీను వైట్లతో చేస్తున్న చిత్రమిది. దీంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 16న ఆడియన్స్ ముందుకు ఎంత కాన్ఫిడెంట్‌గా వస్తున్నాడో రవితేజ మాటల్లోనే...

మూడు క్యారెక్టర్లలో బాగా నచ్చిన క్యారెక్టర్?
-వ్యక్తిగతంగా అమర్ పాత్రే బాగా నచ్చింది. ఆ క్యారెక్టరైజేషన్ సినిమాకే స్పెషల్. అలాగని మిగిలిన రెండింటి క్యారెక్టరైజేషన్లు తక్కువ చేయలేం. శ్రీను వైట్ల స్టోరీ చెబుతున్నపుడే -మూడు పాత్రల్లో వేరియేషన్స్ బలంగా ఉన్నాయన్న భావన కలిగింది.
కథ గురించి?
-ఇపుడు చెప్పలేను. మరో 24 గంటలు ఆగితే మీకే తెలుస్తుంది. బేసికల్‌గా ఏ సినిమా చేసినా, ఫస్ట్ కథ నచ్చాలి. అప్పుడే ఓకే అంటా. శ్రీను నాకు ఈ స్టోరీ చెప్పినపుడే బాగా నచ్చింది. కథకు సంబంధించి నా పరిధిలో కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను. తరువాత శ్రీను స్క్రిప్ట్‌ని ఇంకా బలంగా సిద్ధం చేశాడు.
ఈ టైంలో శ్రీనువైట్లతో సినిమా.. రిస్క్ అనిపించలేదా?
ఒక ఫ్లాప్ వచ్చిందని ఒక మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే, ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టరే బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వొచ్చు. ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ నెక్స్ట్ డిజాస్టర్ ఇవ్వొచ్చు. అయినా ఏ సినిమానైనా బాగా రావాలనే చేస్తాం. నేనెప్పుడూ దర్శకుడిని నమ్ముతాను. హిట్, ఫ్లాప్ అనేవి వచ్చిపోయేవి. కానీ ఈసారి శ్రీను వైట్ల నిరాశపర్చడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే -ఈసారి తన బలహీనతల్ని బలాలుగా మార్చుకుని చేసిన సినిమా ఇది.
మీ ఇద్దరి మార్క్ కామెడీ..?
-అతనూ అదే ఫీలయ్యాడు. ఈ సినిమాలో మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యనివి కూడా ఉంటాయి. శ్రీను వైట్ల ట్రేడ్‌మార్క్ కామెడీ సహా అన్ని ఎమోషన్స్ ఎలివేట్ చేశాడు. అన్నిటికిమించి భావోద్వేగ సన్నివేశాలు బలంగా వెంటాడతాయి. అందరికీ నచ్చుతుందనే నమ్ముతున్నా.
పాత్రల కోసం చేసిన హోమ్‌వర్క్?
-నేనెప్పుడూ హోమ్‌వర్క్ చేయను. నావన్నీ క్లాస్‌వర్క్సే. అక్కడ చేసేయడమే.
సీనియర్ హీరోలు నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు... మీరు?
-ఎందుకు చేయను? నా దగ్గరికి వచ్చిన పాత్ర ఎలాంటిదైనా నచ్చితే చేస్తాను. నెగెటివ్ రోల్స్, మల్టీస్టారర్స్‌లాంటి తేడా ఏమీ లేదు నాకు. నాకు క్యారెక్టర్ నచ్చాలి. ఒక దర్శకుడు నా దగ్గరికి మంచి కథ పట్టుకొస్తే ఎలాంటి క్యారెక్టర్‌నైనా చేస్తా. ఇక దర్శకులు నటుడిగా నన్ను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారా? లేదా? అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే.. నాలో వున్న మైనస్‌లు నాకు చాలా తెలుసు. కానీ నాలో ఉన్న ప్లస్ పాయింట్స్ మీరే చెప్పాలి.
మాస్ ఇమేజ్‌కి భిన్నంగా కొత్తగా చేయాలని అనిపించలేదా?
-డిఫరెంట్ సినిమాలు ఎందుకు చేయలేదు. శంభో శివ శంభో, నా ఆటోగ్రాఫ్, నేనింతే, ఈ అబ్బాయి చాలా మంచోడులాంటి సినిమాలు చేశాను. రిజల్ట్ ఏమైందో మీకు తెలుసు. అలాగని డిఫరెంట్ క్యారెక్టర్లు చేయనని కాదు. కానీ ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకుంటే బెటర్. నేను నీళ్ళలాంటివాడిని. ఎలాంటి పాత్రనైనా చేయగలను. నన్ను సరిగా వినియోగించుకోగల దర్శకుడు ఉండాలి అంతే.
మీ కెరీర్‌లో అసంతృప్తి ఉందా?
-సూపర్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
ఇంత పాజిటివ్‌గా ఎలా ఉంటారు?
-ముందే చెప్పానుగా, నేనేదీ నెగెటివ్‌గా ఆలోచించను. ఇప్పుడే కాదు, ముందునుంచీ అంతే. అలాగే ఉంటాను కూడా. అందరూ అలాగే ఉండాలి. అనవసరమైన స్ట్రెస్, డిప్రెషన్ అస్సలొద్దు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి.
సినిమా ఫ్లాపైనపుడు..?
-తీసుకోనని చెప్పను. మరీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే రేంజ్‌లో అస్సలు ఆలోచించను. నా ఆలోచన ఎప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనే.

తమన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు కదా?
-ఈ సినిమాకి తమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అయినా ఇంతలోనే తను 100 సినిమాలను పూర్తిచేశాడంటే అసలు నమ్మలేకపోతున్నా. తమన్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాడు. ఈమధ్య చాలా మెచ్యూర్డ్ అయ్యాడు.
పూరీ జగన్నాధ్‌తో సినిమా?
-ఉంటుందిగా. ఒక కథమీద వర్క్ చేశాం. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. త్వరలో చూద్దాం.
తమిళ తేరి సినిమా రీమేక్ ఎంతవరకు వచ్చింది?
-ఆ సినిమా చెయ్యట్లేదు. ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అది త్వరలో షూటింగ్ స్టార్టవుతుంది. అలాగే సంతోష్ శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా తేరి రీమేక్ కాదు. అది కొత్త కథ.
వెబ్ సిరీస్‌లు చేసే ఛాన్స్ ఉందంటారా?
-ఎందుకు చెయ్యకూడదు. నేను వెబ్ సిరీస్ బాగా చూస్తాను. ఇక్కడ అవి తీసే సమయం వచ్చినపుడు దానిగురించి మాట్లాడుకుందాం.
ఈ సినిమా హిట్ అయితే హిందీలో చేస్తానని శ్రీను వైట్ల అన్నారు? మీరు హిందీలో నటిస్తారా?
-ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలా ప్రాజెక్టులు వచ్చాయి. కానీ.. చాలా కారణాలవల్ల వర్కవుట్ అవ్వలేదు. ఒకవేళ ఈ సినిమా హిందీలో చేస్తానంటే నేను రెడీ. నేనేదీ చేయనని చెప్పను.
రాజకీయాల గురించి మీ అభిప్రాయం?
-ఈ పాలిటిక్స్, పొలిటీషియన్స్ గురించి పట్టించుకునేంత టైమ్ లేదు. అవసరం లేదు కూడా. నాకు నా సినిమాలు, ప్రేక్షకులు చాలు.
మీటూ ప్రభావం ఎలా ఉంది?
-అందరూ ఇప్పుడు కుదురుగా ఉంటున్నారు. కొంచెం కుదురు వచ్చినట్టుంది కదా. ఇంకా రావాలి.
మీ బెస్ట్ క్రిటిక్ ఎవరు?
-నా గురించి అందరికీ తెలుసు కాబట్టి.. నా సినిమా బాగుందా? బాలేదా? అని నిక్కచ్చిగా అందరూ చెప్పేస్తారు. అంతెందుకు, నా కొడుకే ముఖంమీద సినిమాలో ఏంనచ్చింది, నచ్చలేదో చెప్పేస్తాడు

-శ్రీనివాస్ ఆర్.రావ్