ఆ రీమేక్‌లు అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వస్తున్న వదంతులపై హీరో ‘వెంకటేష్’ క్లారిటీ ఇచ్చారు. మలయాళంలో హిట్టైన ‘టూ స్టేట్స్’, తమిళంలో హిట్టైన ‘సేథుపతి’ సినిమాలను వెంకటేష్ తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నారన్న వార్తలు కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన సురేష్ ప్రొడక్షన్ హౌస్ అలాంటి ప్రయత్నాలేవీ జరగడంలేదని తేల్చింది. అలాగే వెంకటేష్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులపై బిజీగా ఉన్నారని, వాటి వివరాలను కూడా త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది. కాగా ప్రస్తుతం వెంకి మారుతి దర్శకత్వంలో‘బాబు బంగారం’అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది.