రంగు పడుతుందట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనీష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘రంగు’. కార్తికేయ దర్శకత్వం వహించారు. పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్ననాయుడు నిర్మించారు. విజయవాడకు చెందిన లారా అలియాస్ పవన్‌కుమార్ కథతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో తమ బావను ఎలా చూపించారోననే అనుమానంతో థియేటర్‌లో రంగు పడనివ్వం అని లారా కుటుంబ సభ్యులు ఈమధ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీనిపై చిత్ర నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ సినిమాకు సంబంధించి లారా బంధువులు చేసిన ఆరోపణలు సబబుగానే అనిపించాయి. ఈ కథను మా దర్శకుడు రెండేళ్లుగా రీసెర్చ్ చేసి రాశారు. ఆయన చాలా మందిని కలిశారు గానీ, లారా బావమరిదిని కలవలేదన్నది నిజం. లారా జీవిత ఘట్టాలను తెరకెక్కించాం. కాని, చెడుగా చూపించలేదు. సినిమా తరువాత తప్పకుండా మంచి ఒపీనియన్ కలుగుతుంది. వంద శాతం ఈనెల 23న సినిమాను విడుదల చేస్తామన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 2011 నుంచి నేను స్టడీ చేసి ఈ కథను రాసుకున్నాను. లారా బావమరిది చెప్పింది నిజం. ఆయన్ని నేను కలవలేదు. ఆయన తమ్ముళ్లను, మరికొంతమంది సన్నిహితులను కలిశాను. లారా ఫ్యామిలీని వ్యతిరేకించి సినిమా తీసే ఉద్దేశ్యం లేదు. సినిమా చూస్తే లారా మా మధ్య ఇంకా తిరుగుతున్నారనే భావన కలుగుతుంది అన్నారు. తనీష్ మాట్లాడుతూ- మనిషి సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పే సినిమా ఇది అన్నారు.