ఊపిరి దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని మూడోతరం హీరో అక్కినేని అఖిల్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘అఖిల్’ సినిమా హీరోగా అతడికి మంచి పేరే తెచ్చినా సినిమా మాత్రం బాక్సాఫీస్‌వద్ద పరాజయాన్ని చవిచూసింది. దీంతో తన రెండో సినిమాకోసం అఖిల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ తన కొత్త సినిమా విషయమై అఖిల్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఐదు నెలల్లో చాలామంది దర్శకుల పేర్లు వినిపించగా, చివరగా అఖిల్ రెండో సినిమా దర్శకుడు దాదాపుగా ఫిక్స్‌అయ్యాడని తెలుస్తోంది. ‘ఊపిరి’ సినిమాతో అక్కినేని నాగార్జునకు హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉండనుందని సమాచారం. ఇదే విషయమై దర్శకుడు కూడా ఊపిరి ప్రమోషన్స్‌లో ప్రస్తావిస్తూ.. అఖిల్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుందని, అన్నీ కుదిరాక ఈ విషయమై అధికారిక ప్రకటన ఉంటుందని తెలియజేశారు. ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఊపిరి’ సూపర్‌హిట్ కొట్టడంతో.. వంశీ, అఖిల్ రెండో సినిమాకు పర్ఫెక్ట్ అని నాగ్ భావిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే ఈ సినిమా తెరకెక్కనుంది.