పాటల్లో.. తెలంగాణ దేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడ్‌త్యా దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాని, సంగీత హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్ర ఆడియో విడుదల ఆదిత్య మ్యూజిక్ ద్వారా హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, నిర్మాత మొహమ్మద్ జకీర్ ఉస్మాన్ చిత్ర సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉస్మాన్ మాట్లాడుతూ ఆడియో కార్యక్రమనికి హాజరై ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సినిమా బాగావచ్చిందని, అందుకు కష్టపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హీరో జిషాన్ ఉస్మాని మాట్లాడుతూ నాతోపాటు చిత్రంలో నటించి, నాకు విలువైన సూచనలిచ్చిన నటీనటులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు హరీష్ వడ్‌త్యా మాట్లాడుతూ పరిశ్రమలో ఎంతో కష్టాలుపడి ఎదిగిన తనను ఆదరించి ప్రాజెక్టును అప్పగించిన నిర్మాతకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ సంగీత మాట్లాడుతూ ‘మై లక్కీ హీరో శ్రీకాంత్. మేమిద్దరం ఐదు చిత్రాల్లో నటించాము. జిషాన్ హ్యండ్‌సమ్ హీరో. మ్యూజిక్ డైరెక్టర్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ విజయ్‌తో ఇది 3వ సినిమా. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ హరీష్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు చేయాలా వద్దా అని సందిగ్దంలో పడ్డానని, సబ్జెక్ట్‌లో ఎమోషన్స్‌కు కనెక్టై తరువాత సినిమాకు ఓకే చెప్పానన్నారు. తన పాత్రతోపాటు అన్ని పాత్రలతో అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు, మంచి టేస్ట్‌వున్న ప్రొడ్యూసర్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు అన్నారు. స్క్రీన్‌కు పరిచయమవుతున్న జిషాన్‌ను ఆదరించాలని కోరారు.