ఫోర్‌జీ సౌండ్‌తో.. ‘2.0’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సూభాష్‌కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి 600కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవబోతోంది. చిత్రానికి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు 2150 విఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉపయోగించారు. మూడువేల మంది విఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్లు, వెయ్యిమంది టిపికల్ విఎఫ్‌ఎక్స్ షాట్‌మేకర్స్ సినిమా కోసం పనిచేశారు. తాజాగా సినిమా మేకింగ్ వీడియోలు, పాట, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పూర్తిస్థాయి త్రీడీ టెక్నాలజీతో 4డీ సౌండింగ్‌తో తెరకెక్కిన తొలి భారతీయ సినిమా ‘2.0’ అని యూనిట్ చెబుతోంది. ఈ సినిమా తెలుగు వర్షన్‌ను ఎన్‌విఆర్ సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌వి ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రలో విడుదల చేస్తున్నారు. ‘2.0’ పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో 2.0 ట్రైలర్, పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ ‘విజువల్ వండర్‌గా రూపొందిన ‘2.0’ ప్రపంచవ్యాప్తంగా 29న వస్తోంది. మంచి మెసేజ్‌తో ప్రతి సన్నివేశాన్నీ అద్భుతంగా మలిచాడు దర్శకుడు శంకర్. భారతీయ సినిమా స్థాయిని చాటిచెప్పే ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చిన నిర్మాత సుభాష్‌కరణ్‌ను అభినందించాలి. ఎంతోమంది టెక్నీషియన్లు రేయింభవళ్లు కష్టపడ్డారు. సినిమాకోసం నేనూ అందరిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ‘రజనీతో నేను చేస్తున్న మూడో సినిమా ‘2.0’. పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్. త్రీడీ టేకింగ్, 4డీ సౌండింగ్ అనుభవాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రెహమాన్, రసూల్‌పూకుట్టి కొత్త సౌండింగ్ టెక్నాలజీని చిత్రంతో పరిచయం చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎఆర్ రెహమాన్ మాట్లాడుతూ ‘2.0కి సంగీతం అందించటం గొప్ప అనుభవం. ఎనిమిది సినిమాలకు పనిచేసినంత హ్యాపీగా ఉంది. 4డీ సౌండింగ్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం. రీ రికార్డింగ్ కోసం చాలా కష్టపడ్డాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టెక్నీషియన్లు అహర్నిశలు కష్టపడ్డారు. 29న చిత్రం విడుదలతో సరికొత్త అనుభూతిని ప్రేక్షకులు అందుకుంటారు’ అన్నారు.