చంద్రముఖి-2లో అనుష్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ అనుష్క ప్రస్తుతం ‘బాహుబలి-2’, సూర్య హీరోగా నటిస్తున్న ‘సింగం-3’ సినిమాలో నటిస్తోంది. దాంతోపాటు మరో క్రేజీ సినిమాలో నటించేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘శివలింగ’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోగా రజనీకాంత్‌ను ఒప్పించాలని ప్రయత్నాలు జరిగాయి. ‘రోబో 2.0’ సినిమాతో రజనీ బిజీగా ఉండటంతో ఇప్పట్లో డేట్స్ దొరికే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తాడని అంటున్నారు. ఈ చిత్రానికి ‘చంద్రముఖి-2’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో గ్లామర్ భామ అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నారు. మరి రెండవ చంద్రముఖిగా అనుష్క ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!