శశికళ ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్‌టైనర్‌ను తెలుగులో ‘శశికళ’ పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. జయరాజ్, నితిన్‌రాజ్, మిషా ఘోషల్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, అందరినీ భయపెడుతూ.. వినోదాన్ని అందించే హారర్ ఎంటర్‌టైనర్ ఇదని, భారతీరాజా సోదరుడు జయరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారని, నిజానికి ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ చేయాలనుకున్నామని, కానీ అదే రోజు 14 సినిమాలు రిలీజ్ అవుతుండడంతో రెండు వారాల గ్యాప్ తరువాత రిలీజ్ చేయాలనుకుంటున్నామని’ తెలిపారు. ‘లాభనష్టాలను లెక్కచేయకుండా రామసత్యనారాయణ సినిమాలను తీస్తూనే ఉన్నాడని, ఈ సినిమా ఆయనకు పెద్ద హిట్ ఇవ్వాలని’ రేలంగి నరసింహారావు ఆకాంక్షించారు. ఈ సినిమా విజయాన్ని సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని సుధాకర్‌బాబు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, లోహిత్, సిరాశ్రీ, రవి తదితరులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఈ చిత్రానికి ఫొటోగ్రఫి:వెంకటేష్, సంగీతం:నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:డా శివ వై.ప్రసాద్, బి.సత్యనారాయణ, నిర్మాత:తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వినుభారతి.