అ.. ఆ... టీజర్ వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతా జంటగా నటిస్తున్న ‘అ.. ఆ..’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజా సమాచారంమేరకు ఈ సినిమా టీజర్‌ని ఈనెల 30న నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘అ... ఆ..’ అన్న టైటిల్, ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ అన్న ట్యాగ్‌లైన్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాని త్రివిక్రమ్ తనదైన శైలిలో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి తన పాత్ర గురించి సమంత తన కెరీర్‌లోనే మరచిపోలేని పాత్రగా పేర్కొనడం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సిని మా మే 6న విడుదల కానుంది.