‘సరబ్‌జిత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరబ్‌జిత్’ చిత్రంలోని ఓ పాటలో పంజాబీ సంప్రదాయ దుస్తులు, అలంకరణతో మెరిసిపోయింది అందాలతార ఐశ్వర్యారాయ్. చేతినిండా గాజులు, ఎర్రని పంజాబీ సంప్రదాయ దుస్తులు, కంటి కాటుక పెట్టుకుంటూ ఓ పాటలో కన్పించే ఐశ్వర్యరాయ్ ఫొటోను ఆ చిత్రం యూనిట్‌ను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. ఈ ఫొటోలో కొత్తగా కన్పించిన ఐశ్వర్య మరోసారి తన అభిమానుల మనసు చూరగొంది. పంజాబ్‌కు చెందిన సరబ్‌జిత్ అనే రైతు పొరపాటున పాకిస్తాన్ హద్దుల్లోకి వెళ్లడం, అక్కడి ప్రభుత్వం అతడిని అరెస్టుచేసి జైలులో పెట్టడం, అతడి విడుదలకోసం భారత్‌లో అతడి సోదరి పోరాటం చేయడం ఇతివృత్తంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇది నిజంగా జరిగిన కథ. ఈ చిత్రంలో సరబ్‌జిత్ సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్య నటిస్తోంది. మే 20న ఈ చిత్రం విడుదలకానుంది.