క్రేజీ క్రేజీ.. పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మాతగా సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం -క్రేజీ క్రేజీ ఫీలింగ్’. కేరింత, మనమంతా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్, పల్లక్ లల్వాని జంటగా, వెనె్నల కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా పోస్టర్‌ను కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో విశ్వంత్ మాట్లాడుతూ ‘దిల్‌రాజు కేరింత, సాయి కొర్రపాటి మనమంతా చిత్రాల తరువాత మంచి కథ కోసం ఎదురు చూశాను. పూర్తి వినోదాత్మకంగా కుటుంబమంతా చక్కగా నవ్వుకునే ఈ సినిమా విజయంపై నమ్మకముంది’ అన్నారు. సెన్సార్‌ను త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి క్రేజీగా ఎదురుచూస్తున్నామని దర్శక రచయిత సంజయ్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. వెనె్నల కిశోర్‌కు జంటగా ఫిదా ఫేమ్ శరణ్య్ నటించిన చిత్రంలో పోసాని, సుమన్, జయప్రకాష్‌రెడ్డి, గుండు సుదర్శన్, కృష్ణంరాజు, చమ్మక్ చంద్ర, భద్రం, అదిరే అభి, జబర్దస్త్ ఫణి, రాకేష్, ప్రియాంక, షఫీ తదితరులు మిగిలిన పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు.