అనసూయ స్పెషల్ సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ మరోసారి స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఇంతకుముందు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’లో సాయిధరమ్‌తో కలిసి స్టెప్పులు వేసిన ఆమె, తాజాగా వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో కలిసి ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నది.
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2లో వెంకీ, వరుణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ చిత్రంలో ఒక ఫన్ సాంగ్‌లో వీరిద్దరితో కలిసి స్టెప్పులు వేయనుంది అనసూయ. ఇక ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.