మళ్లీ హీరోగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగిన సునీల్, హీరోగా ట్రైచేసి సరైన హిట్ ఒక్కటి కొట్టలేకపోయాడు. హీరోయిజం సినిమాలకు సరైన ఓపెనింగ్స్ లేక డిజాస్టర్లు ఎదురవ్వడంతో, సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకుని మళ్లీ కమెడియన్‌గా మారాడు. ఆ లైన్‌లో మంచి అవకాశాలు తలుపుతట్టాయి. వరుసగా చేతినిండా సినిమాలున్నాయి. ఆదాయం కూడా కమెడియన్‌గా బాగానే వుంది. కానీ సునీల్‌కు ఇంకా హీరోగా హిట్‌కొట్టి తీరాలన్న కోరిక పోలేదని టాక్ వినిపిస్తోంది. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ టీం తయారు చేసిన కథ విని ఓకె చెప్పాడట. ఇప్పుడు నిర్మాత కోసం వెదుకులాట సాగుతోందని వినికిడి. కానీ సమస్య ఏంటంటే, సునీల్ ఇప్పుడు కోటికో, లోపో రెమ్యూనరేషన్‌తో సినిమా చేసే అవకాశం లేదు.
కనీసం రెండు కోట్లు లేదా దగ్గరగా ఉండే ఫిగర్ చెప్పాల్సిన పరిస్థితి. పైగా నిర్మాణ వ్యయం. అంతా కలిపి ఆరేడు కోట్లకు పైమాటే. అందుకే నిర్మాతల కోసం వెదుకులాట మొదలైంది. అన్నీ బాగానే వున్నాయి కానీ ఈమధ్య అమర్ అక్బర్ ఆంథోనిలో సునీల్‌ను చూస్తే, తొలినాళ్లలో ఎలా లావుగా వుండేవాడో అలా కనిపించాడు. మరి మళ్లీ హీరో అంటే జిమ్‌లో కష్టపడక తప్పదేమో.