ఆ అపోహ తప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకెప్పుడూ పొరుగింటి పుల్లకూర రుచే. అందుకే తెలుగు పరిశ్రమలో తెలుగు హీరోయన్లు తక్కువ. అయితే తెలుగు భామలూ టాలెంట్‌లో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తూనే ఉన్నారు.. ఆ లిస్ట్‌లో ఈషారెబ్బను చెప్పుకోవాలి. ఈ అచ్చ తెలుగమ్మాయి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని కృషి చేస్తూనే ఉంది. తాజాగా హీరో సుమంత్‌తో కలిసి సుబ్రహ్మణ్యపురం అనే సస్పెన్స్ థ్రిల్లర్‌తో ముందుకొస్తోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతూ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ ఈషారెబ్బ చెప్పిన ముచ్చట్లు.

ఏంటి సినిమా స్పెషల్?
-నాకు సంతోష్ రెండుగంటలపాటు కథ చెప్పాడు. అది విజువలైజ్ చేసుకున్నపుడు కథ బాగా నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే నాకు ఇష్టం. నెక్స్ట్ ఏమవుతుందన్న టెన్షన్‌తో సినిమా చూసే ఫీలింగ్ బావుంటుంది. ఆ ఎలిమెంట్స్ సుబ్రహ్మణ్యపురంలో ఉన్నాయి. అందుకే ఓకే అనేసా.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
-సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా కనిపిస్తా. ఊరు, కుటుంబం అంటే ఇష్టపడే అమ్మాయ పాత్ర. తండ్రి అంటే మరీ ఇష్టం. దేవుడంటే భక్తి. సినిమాలో లవ్‌స్టోరీ ఉంటుంది కానీ అది థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ని డిస్ట్రర్బ్ చేయదు. ఇక రియల్ లైఫ్‌లో నేను దేవుడ్ని నమ్ముతాను, కానీ పూజలవీ చేయను.
హీరో సుమంత్‌తో పనిచేయడం?
-నేను భక్తురాలుగా కనిపిస్తే, సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేస్తాడు. వారి అభిప్రాయాల మధ్య ఘర్షణ ఉంటుంది. దేవుడున్నాడని నమ్మే అమ్మాయికి, దేవుడు పై రీసెర్చ్ చేసే అబ్బాయికి మధ్య లవ్ ఫీల్ ఎలా నడిచిందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమంత్ కూల్‌గా ఉంటాడు. గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీరావా సినిమాలు నాకు ఇష్టం. ఆయన నటన సహజంగా ఉంటుంది.
కొత్త దర్శకుడితో పనిచేయడం?
-సంతోష్ క్లారిటీ ఉన్న డైరెక్టర్. అతను బౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చాడు. ప్రతి సీన్ వివరించే విధానం క్లారిటీగా ఉంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉండేలా డిజైన్ చేశాడు. మొదటి సినిమా దర్శకుడిలా అనిపించలేదు. టీంతో వర్క్‌చేయడం ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆర్‌కె ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్‌చంద్ర మ్యూజిక్ పెద్ద అసెట్.
నిర్మాత గురించి?
-నిర్మాత అంటే ఓన్లీ బడ్జెట్‌లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటాం. కానీ సుధాకరరెడ్డి సినిమా కథ చర్చలోనూ పాల్గొనేవారు. రోజూ షూట్‌కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. సుబ్రహ్మణ్యపురం అవుట్‌పుట్ ఇంత ఎఫెక్టివ్‌గా రావడానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ కారణం.
అరవింద సమేతతో నిరాశగా ఉన్నారా?
-ఆ సినిమాలో అంత ప్రాముఖ్యతలేని పాత్ర ఒప్పుకున్నానని చాలామంది అడిగారు. కానీ నేను ఆ సినిమా చేయడానికి చాలా కారణాలున్నాయి. ఆ పాత్ర నాకు నచ్చడం మొదటి విషయమేతే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లాంటి స్టార్స్ కాంబినేషన్‌లో సినిమా ఛాన్స్ రావడం గొప్ప విషయం. అందుకే ఒప్పుకున్నా. నిరాశగా లేను.
పెద్ద ప్రాజెక్టుల్లో ఛాన్స్‌లు..?
-నావరకైతే వచ్చినవాటిలో బెస్ట్ ఎంచుకుని చేస్తున్నా. పెద్ద సినిమాల్లో ఎవరూ అడగలేదు. వచ్చిన కథల్లో నచ్చినవి చేస్తున్నా. ఒక పాత్రకు నేను ఉంటే బాగుంటుంది అనుకునే పాత్రలను చేస్తున్నాను. నాకు కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్‌లో వర్క్‌చేయాలని ఉంటుంది. నేను అలాంటి పాత్రలకోసం అప్రోచ్ అవుతాను. పని అడగటంలో తప్పులేదుగా.
రాజవౌళి మల్టీస్టారర్‌లో నటిస్తారట?
-నిజమా.. నాకైతే ఆ సినిమా విషయంలో ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ఆ ఛాన్స్‌వస్తే నేను నిజంగా లక్కీ.
తెలుగమ్మాయిలకు ఛాన్సులు లేవంటారా?
-ఈ ప్రశ్న నాకు చాలాసార్లు ఎదురైంది. ఇక్కడ ఎవరి అవకాశాలు వారివే. ఒక్కోసారి ఒక్కోలా మారిపోతూ ఉంటుంది. చాలామంది అయితే తమిళ, కన్నడ భాషల్లో ట్రై చేసుకో ఇక్కడ అవకాశాలు ఇవ్వరని చెప్పారు. కానీ మనలో టాలెంట్ ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయన్న నమ్మకముంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఆ అపోహ తప్పు అని నా భావన.
తదుపరి చిత్రాలు?
-ప్రస్తుతం తెలుగులో రెండు కథలు చర్చల్లో ఉన్నాయి. దాంతోపాటు తమిళంలో జీవీ ప్రకాష్‌తో ఓ సినిమా చేస్తున్నా. అలాగే కన్నడలో శివరాజ్‌కుమార్ సరసన మరో సినిమా చేస్తున్నాను.

-శ్రీనివాస్ ఆర్.రావ్