‘పోస్టర్’ అదరహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్‌లో టి.ఎం.ఆర్ దర్శకుడిగా, విజయ్ ధరణ్, అక్షత సోనావానే, రాశిసింగ్ హీరో హీరోయన్లుగా శేఖర్‌రెడ్డి, గంగారెడ్డి, ఐ.జి.రెడ్డిలు నిర్మాతలుగా ‘పోస్టర్’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం 80 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జరిపిన ప్రెస్ మీట్‌లో శివాజీరాజా మాట్లాడుతూ- దర్శకుడుకి ఇది మొదటి సినిమా అయినా క్లారిటీగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తమ సొంత సినిమాలా ఫీలై పనిచేస్తున్నారు. కథకు కరెక్టుగా సరిపోయే టైటిల్ పోస్టర్ అన్నారు. దర్శకుడు మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ-కొత్త పాత తరం నటీనటులతో తీస్తున్న చిత్రమిది. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. పోస్టర్‌లు కూడా అతికించుకునేందుకు పనికిరాని ఓ కుర్రాడు పోస్టర్‌మీదికి ఎలా ఎక్కాడు అనేది ఇంట్రెస్టింగ్ డ్రామాతో చెప్పడం జరిగింది అన్నారు. హీరో విజయ్ దరణ్ మాట్లాడుతూ- ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతోపాటు అన్ని ఎమోషన్స్ వున్న చిత్రం అన్నారు. మిగిలిన రెండు పాటలు ఔట్‌డోర్‌లో చిత్రీకరించడం జరుగుతుందన్నారు.