ఆర్‌ఆర్‌ఆర్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజవౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ షూటింగ్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఈరోజుతో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుందని చిత్రబృందం ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. కాగా మొదటి షెడ్యూల్‌లో రాజవౌళి ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజవౌళి బాహుబలి తరువాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.