లవ్ అండ్ టెక్నాలజీతో అనగనగా ఒక ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ ఫైనాన్సియర్ కె.ఎల్.ఎన్.రాజు చాలాకాలం తరువాత థౌజండ్ లైట్స్ మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ‘అనగనగా ఒక ప్రేమకథ’ డిసెంబర్ 14న విడుదలకు సిద్ధమైంది. గతంలో రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రోజు’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ చిత్రాలు నిర్మించారు. ఈ సందర్భంగా కె.ఎల్.ఎన్.రాజు చిత్ర నిర్మాణ విశేషాలను తెలుపుతూ- బేసికల్‌గా నాకు లవ్‌స్టోరీలు అంటే ఇష్టం. ఆ రెండు సినిమాల తరువాత ఇన్నాళ్లకుమరలా ఈ సినిమా తీయాలి అనిపించింది. దర్శకుడు ప్రతాప్ నాకు సబ్జెక్టు వినిపించాడు. బాగా నచ్చింది. దీనికి ఒక యంగ్ హీరో కావాలి. ఆ హీరో విరాజ్ అశ్విన్‌తో సినిమా ప్రారంభించాను. ఇది ఒక టిపికల్ లవ్‌స్టోరీ. టెక్నాలజీ అన్నది రోజురోజుకు పెరుగోతదం. కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా అది మన ఫైవ్ సెనె్సస్‌కు లోబడే ఉండాలి. అలా కానపుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే కథాంశమిది. దర్శకుడు కథ చెప్పినపుడు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో సినిమా తీసేటప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్‌గా సినిమా తీశాడు. హీరోయిన్ రిద్ధికుమార్ చాలా బాగా చేసింది. అలాగే సెకెండ్ హీరోయిన్‌ఘా రాధా బంగారు కూడా బాగా చేసింది. కాశీ విశ్వనాథ్, అనీష్ కురువిల్లా, వేణు తదితరులు మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. పెద్ద సినిమాలు, మల్టీస్టారర్స్ తీయడంకంటే చిన్న సినిమాలు తీయడంలోనే నిజమైన ఛాలెంజ్ ఉంటుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ద్వారా డిసెంబర్ 14న సినిమాను రిలీజ్ చేస్తున్నాం అన్నారు.