లవ్.. కేరాఫ్ వాట్సప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాముని ఈవెంట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్‌రెడ్డి సమర్పించు చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. బాహుబలిలో ప్రభాస్ చైల్డ్ యాక్టర్ నిఖిల్, సాహితి హీరో హీరోయిన్లు నీరజ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు దర్శకుడు అల్లాడి రవీందర్‌రెడ్డి, నిర్మాత లక్ష్మికాంత్‌రెడ్డి. ఈ చిత్ర ట్రైలర్‌ను సీనియర్ డైరెక్టర్ సముద్ర, ఆడియో బిగ్ సీడీని నటుడు నోయల్ విడుదల చేశారు. కోటేశ్వర్‌రావు, మిర్చి మాధవి, రాజేందర్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో సముద్ర మాట్లాడుతూ ట్రైలర్ చూస్తే లవ్ టీనేజ్ స్టోరీ అని అర్థమవుతుందని, యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పుడే సినిమా ఆడుతుందని, అది సినిమాలో కనపడుతోందన్నారు. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయని అంటూ, టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రొడ్యూసర్ సపోర్ట్‌తో సినిమా ఇక్కడి దాకా చేరిందన్నారు. వాట్సప్‌తోనే రోజు మొదలై వాట్సప్‌తోనే రోజు ముగుస్తున్న తరుణంలో ఈ సినిమా అందరికీ గుర్తుకు రావాలనే టైటిల్ పెట్టామన్నారు. నిర్మాత లక్ష్మీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ నిర్మాతగా ఇది మొదటి సినిమా అని, డైరెక్టర్ కష్టపడి సినిమా చేశారని, అందరూ మంచి సహకారాన్ని అందించారన్నారు. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సినిమాలో అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతూ, చాలా కష్టపడి సినిమా చేశామని ఆదరించి ఆశీర్వదించాలని హీరో నిఖిల్, హీరోయిన్ సాహితి కోరారు.