చిన్నా.. 96తో వస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ్ 96 మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైన నాటి నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా దీపావళి సందర్భంగా టీవీల్లో ప్రదర్శించినా కూడా కొన్ని థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈ సినిమాపై తెలుగు నిర్మాత కన్ను పడింది. ఈ సినిమా రీమేక్ హక్కులను కొన్న దిల్‌రాజు మొదట్లో నాని హీరోగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యాలని భావించగా నాని రిజక్ట్ చేసినట్టు వార్తలొచ్చాయి. తర్వాత దిల్‌రాజు అల్లు అర్జున్‌కు ఈ సినిమా చూపించటంతో అల్లు అర్జున్ ఫిదా అయ్యాడని త్వరలోనే ఇద్దరి కాంబినేషన్‌లో 96 సినిమాకు తమిళంలో దర్శకత్వం వహించిన దర్శకుడితోనే ఈ సినిమా ఉండబోతుందంటూ వార్తలొచ్చాయి. ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా 96 తెలుగు రీమేక్ విషయంలో వినిపిస్తున్న మరో వార్త, గోపీచంద్ ఈ సినిమాలో నటించబోతున్నాడట. ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో డీలాపడ్డ గోపీచంద్ గనక ఫీల్‌గుడ్ మూవీగా హిట్టైన ఈ సినిమాలో నటిస్తే పాజిటివ్ రిజల్ట్‌తో అతని కెరీర్ మళ్ళీ గాడిలో పడే అవకాశముంది. తమిళ్‌లో త్రిష, విజయ్ సేతుపతిల అద్భుత అభినయం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. మరి తెలుగులో హీరోయిన్ ఎవరన్న దానిపై ఇంకా ఎలాంటి వార్తలు వినిపించటం లేదు.